Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో ప్రకారం జరిగిన లోకల్ క్యాడర్ కేటాయింపు తర్వాత ప్రధానోపాధ్యాయులు చేసుకున్న సుమారు 94 అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావును బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, కోశాధికారి బి తుకారాం, ప్రధానోపాధ్యాయులు రవీందర్‌రెడ్డి, వహీద్, విజరుకుమార్, వెంకటలక్ష్మి కలిసి వినతిపత్రం సమర్పించారు. మల్టీ జోన్ క్యాడర్లోని ప్రధానోపాధ్యాయుల స్పౌజ్, మెడికల్, జనరల్ అప్పీళ్లు నాలుగు నెలలుగా పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఒక్కటీ పరిష్కారం కావడం లేదని వివరించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారనీ, సీఎస్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.