Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి సాంబయ్య జయమ్మ దంపతుల కుమార్తె అనూష ఇటీవల ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించింది. కళాశాల ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉపాధి పనులకు వెళుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఆ విద్యార్థికి రెండు లక్షల ఆరవైల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. విద్యార్థినిని హైదరాబాద్‌లోని తన నివాసానికి తీసుకరావాలంటూ పార్టీ నేత సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డిని కోరారు.
మోసం...దగా..కుట్రలే..: ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంపై కాంగ్రెస్
ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానమంతా మోసాలు, దగా, కుట్రలతో సాగిందని టీపీసీసీ పేర్కొంది. రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను కేేసీఆర్ ఒక వ్యాపార వస్తువులా ఉపయోగించారని తెలిపింది. దేశంలోనే అతి పెద్ద అవినీతితో కూడిన రాజకీయ ఆస్తిపరునిగా కేసీఆర్ ఎదిగారని ఆరోపించింది. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు మల్లు రవి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారనీ, వారందరినీ కేసీఆర్ నిలువునా ముంచారని ఆరోపించారు. త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. 1200 మంది తెలంగాణ బిడ్డలు బలిదానం చేసుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత వారి కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు.
చీమలు పెట్టిన పుట్టలో పాములు : రేవంత్
'చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయనీ, అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టింది. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుంచి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉంది.' టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్పై ట్విట్టర్ వేదికగా విమర్శించారు.