Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని నరేంద్రమోడీ రైతు విరోధి
- ప్లీనరీలో బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశం ఇంకెంతకాలం పేద దేశంగా ఉండాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన ఫైర్ అయ్యారు. ప్రజల్లో కుల, మత పిచ్చి రేపే సంస్థల ఎజెండా, రెచ్చగొట్టే ప్రసంగాల ఉద్వేగాలకు లోనయ్యి, బలహీనులుగా మారొద్దని చెప్పారు. ఒక మతానికి సంబంధించిన ఊరేగింపులో ఇంకో మతాన్ని కించపరచమని ఏదేవుడు చెప్పాడని ప్రశ్నించారు. తన పేరుపై కొట్టుకు చావండని ఏ దేవుడు చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్న కుల,మతాలు, వర్గాలు, సంస్కృతుల సమాహారంగా భారత దేశం ఉన్నదనీ, అలాంటి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ కావాలని ఆకాంక్షించారు. ''సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని మోదీ గొప్ప ప్రసంగాలు చేస్తారు.. కానీ ఆయన పాలనలో వికాస్ అన్నది వింత పదమైంది'' అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్వేషమే నాలుగు పాదాల మీద నుడుస్తున్నదని ఆక్షేపించారు. సోషల్ మీడియా ద్వారా సోషల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 1987లో చైనా, ఇండియా జీడీపీ పరిమాణం ఒక్కటేననీ, కానీ ఇప్పుడు భారతదేశ జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లు ఉంటే, చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరిందని ఉదహరించారు. భారతీయుల తలసరి ఆదాయం 1800 డాలర్లు ఉంటే.. చైనా 9 వేల డాలర్లకు ఎగబాకిందని వివరించారు. తెలంగాణలో అభివద్ధి, సంక్షేమం ఏడేండ్లలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.