Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్ల ప్రయాణం, ప్రభుత్వ ప్రస్థానంపై ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్ వ్యాసాల సంకలనం 'ఆరోహణ' పుస్తకాన్ని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీలో ఆవిష్కరించారు. పుస్తక రచయిత టంకశాల, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్, గ్రంథాలయాల పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు అయాచితం శ్రీధర్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశంపై అనుముల పద్మ సంతోశ్ రాసిన పాటల సీడీని కూడా సీఎం ఆవిష్కరించారు. ఆమె కొన్నేండ్ల పాటు క్యాన్సర్తో పోరాడి, దాన్ని జయించిందని అనంతరం టీఆర్ఎస్పై 30 పాటలు రాసిందని ఆయన అభినందించారు.