Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గా మాధవి
హైదరాబాద్: గులాబీ జెండా ఎగరాలి..పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఉప్పల్ నియోజకవర్గం లో మల్లాపూర్ డివిజన్ లో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఎం బి దుర్గా మాధవి యాదవ్ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గా మాధవి మాట్లాడుతూ కేసీఆర్ ఆర్ ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని వివరిం చారు. రాష్ట్ర అభివద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్తున్నదని తెలి పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ 21 సంవత్సరాల ఆవిర్భావ దినోత్స వాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరుపుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు పార్టీకి కొండంత అండ నిలుస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు జయరాజ్. దశరథ్. గౌరీ.. కిష్టమ్మ.. తులసి. విజయ. సరిత. సాయి. వెంకట్ రెడ్డి. దయ. పద్మా రెడ్డి. స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.