Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. బుధవారం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో పలు ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదంటూ జీహెచ్ఎంసీ నిబంధనలు విధించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలే భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి రూ.65వేలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50వేలు, మైనంపల్లి రోహిత్‌కు రూ.40వేలు, మోర్తె క్లినిక్‌కు రూ.10వేలు, కె.నవీన్ కుమార్‌కు రూ.10వేలు, వేముల సంతోష్‌రెడ్డికి రూ.5వేలు, ఇ.శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50వేలు, కె.సాయిబాబాకు రూ.20వేలు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు రూ.10వేలు, దానం నాగేందర్‌కు రూ.5వేలు, మేయర్ విజయలక్ష్మికి రూ. 30వేలు జరిమానా విధిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చలాన్లు వేశారు. అయితే ట్విట్టర్లో అందిన ఫిర్యాదుల ఆధారంగానే జరిమానాలు విధించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ నామమాత్రంగానే జరిమానాలు విధించిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జరిమానాలు విధించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ ఫ్లెక్సీలను తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ తప్పుకున్నారు.