Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపారు. గాలిలో తేమ శాతం తగ్గందనీ, రాబోయే నాలుగు రోజుల పాటు ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. కాగా బోరజ్ (ఆదిలాబాద్), జక్రాన్ పల్లి (నిజామాబాద్)లో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. నేరెళ్ల (జగిత్యాల), జైనాథ్ (ఆదిలాబాద్), ఎండపల్లి (జగిత్యాల), ఆలూరు (నిజామాబాద్)లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్రంలోని 92 ప్రాంతాల్లో వర్షపాతం నమోదయినట్టు వెల్లడించారు.