Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరో సారి గుర్తింపు దక్కిందని పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ నేతృత్వంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చైర్మెన్‌గా మరో పద్దెనిమిది మందితో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైందని పేర్కొన్నారు. ఇందులో మెజారిటీ సభ్యులు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే అడవులు, పర్యావరణం సంబంధిత శాఖలు, సంస్థలకు చెందిన ఉన్నతాధికారులున్నారని తెలిపారు. ఈ కమిటీలో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), అటవీ దళాల అధిపతి (హెచ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్) హోదాలో తనకు స్థానం దక్కిందని aపేర్కొన్నారు. జాతీయ అటవీ విధానం (నేషనల్ ఫారెస్ట్ పాలసీ), అటవీ పరిరక్షణ చట్టం -1980కి అవసరమైన మార్పులు, ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం పెంపు కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని, అమలు చేసేందుకు మరో వర్కింగ్ గ్రూప్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఇందులో కూడా తెలంగాణ పీసీసీఎఫ్‌కు చోటు దక్కిందని తెలిపారు. ఇలా జాతీయ స్థాయిలో అటవీ విధానాల రూపకల్పనపై ఏర్పాటు చేసిన రెండు ఉన్నతస్థాయి కమిటీల్లోనూ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారికి చోటు దక్కటం ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు. హరితహారం ద్వారా గత ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన పచ్చదనం పెంపుతో పాటు, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకుందని గర్తుచేశారు. అనేక రాష్ట్రాలు మనల్ని మోడల్‌గా తీసుకుని వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉన్నతస్థాయి కమిటీలో తెలంగాణకు చోటు కల్పించిందని పేర్కొన్నారు. వచ్చే నెల ఐదున ఢిల్లీలో జరిగే టాస్క్ ఫోర్సు సమావేశానికి తాను హాజరవుతారని తెలిపారు.