Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గుంతకల్లు డివిజన్లోని గుంతకల్లు నల్వార్ మధ్య పురోగతిలో ఉన్న మౌలిక సదుపాయాల పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇంచార్జీ) అరుణ్‌కుమార్ జైన్ తనిఖీ చేశారు. ఆయన వెంట గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ కె వెంకటరమణారెడ్డితోపాటు ప్రధాన కార్యాలయం, డివిజన్ కార్యాలయానికి చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అరుణ్‌కుమార్ జైన్ గుంతకల్లు నుంచి తనిఖీలను ప్రారంభించారు. ప్రత్యేక రైలులో గుంతకల్లు నుంచి ఆదోనికి అనంతరం నల్వార్ వరకు ప్రయాణించి ట్రాన్ నిర్వహణను, భద్రత అంశాలను పరిశీలించారు. ఆదోని రైల్వే స్టేషన్ వద్ద వివిధ ప్రయాణీకుల సౌకర్యాలను, ఆహార విక్రయ కేంద్రాలను, సర్క్యులేటింగ్ ఏరియాను తనిఖీ చేశారు. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం గూడ్స్ షెడ్డును సందర్శించి అక్కడ సరుకు రవాణా లోడింగ్ వసతులను పరీక్షించారు. తనిఖీలలో భాగంగా రాయచూరులోని గూడ్స్‌షెడ్ వద్ద లోడింగ్ వసతులను, హమాలీల వసతి గృహం వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరీక్షించారు.