Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ నిర్వహించిన ప్లీనరీ, అందులో ఆమోదించిన తీర్మానాలతో బీజేపీ వెన్నులో వణుకు పుడుతున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. దేశాన్ని మతపరమైన అజెండాతో విభజించాలనే కమలం పార్టీ ప్రయత్నాలను ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఎండగట్టారని విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానందగౌడ్తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో ఆ పార్టీకి ఓట్లేయలేదనే కారణంతో దళితులపై బీజేపీ నేతలు తుపాలకులతో దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మానుకోవాలనీ, లేదంటే కాషాయ పార్టీకి పుట్టగతులుండబోవని హెచ్చరించారు.