Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్‌కుమార్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల ఆదాయాన్ని మూడు, నాలుగు రెట్ల వరకు పెంచేందుకు వీలుగా రానున్న మూడేండ్లలో ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వాకల్చర్ అభివృద్ధి కోసం 'బ్లూ ప్రింట్' సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో ఆక్వాకల్చర్‌పై మత్స్య, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ మాట్లాడుతూ రైతులను ఆక్వాకల్చర్ వైపు మళ్లించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, గద్వాల, కరీంనగర్, పెద్దపల్లిలో సంబంధిత క్లష్టర్లను అభివద్ధి చేయాలని సూచించారు.