Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మే 2వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులు. వేసవి సెలవుల నేపథ్యంలో అత్యవసర కేసులను వెకేషన్ కోర్టులు విచారించనున్నాయి. లంచ్‌మోషన్, అత్యవసర కేసులు, ముందస్తు బెయిల్, బెయిల్ అప్లికేషన్లు, బెయిల్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్ తదితర అత్యవసర కేసులను మాత్రమే వెకేషన్ కోర్టులు విచారిస్తాయని హైకోర్టు ఒక ప్రకటనలో పేర్కొంది.మే 2, 8, 16, 23, 30 తేదీల్లో అత్యవసర కేసులను దాఖలు చేసుకోవాలి. వాటిని వరసగా 5వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి, జస్టిస్ నాగార్జునల ధర్మాసనం, మే 12న జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం, 19వ తేదీన జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ ఎం. సుధీర్ కుమార్ ధర్మాసనం, 26న జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం,జూన్ 2న జస్టిస్ జి. శ్రీదేవి, జస్టిస్ ఎం.లక్ష్మణ్‌ల ధర్మాసనం విచారణ చే స్తాయి. ఆ తేదీల్లో సింగిల్ జడ్జీల బెంచ్‌లు విచారిస్తాయి. న్యాయమూర్తులు జస్టిస్ ఎ.సంతోష్‌రెడ్డి, జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి, జస్టిస్ జువ్వాడ శ్రీదేవి, జస్టిస్ ఎస్.నంద, జస్టిస్ ఎన్.తుకారాంజీల సింగిల్ బెంచ్‌లు విచారిస్తాయి.
రైలు పట్టాలు దాటుతూ మరణిస్తే.. పరిహారం ఇవ్వక్కర్లేదు
రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి వెళ్లకుండా చట్ట నిబంధనలు ఉల్లంఘించి రేలు పట్టాలు దాటిన వ్యక్తి ఏదైనా సంఘటన కారణంగా మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబం పరిహారం పొందే అర్హత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆకివీడు నుంచి రైలులో వెళ్లిన సుబ్బురత్నమ్మ అనే మహిళ సింగరాయకొండలో దిగి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢకొీని మరణించారు. రైల్వే శాఖ పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె భర్త వెంకటేశ్వర్లు పిటిషన్‌ను రైల్లే ట్రిబ్యునల్ కొట్టేసింది. దీనిపై అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమా చక్రవర్తి కొట్టేశారు. రైలు పట్టాలు దాటడం నేరమని, ఇలాంటి సంఘటనల కారణంగా మరణిస్తే పరిహారం పొందే అర్హత పిటిషనర్‌కు లేదని తేల్చారు.
వట్టినాగులపల్లి పరిధిపై తీర్పు వాయిదా
వట్టినాగులపల్లి గ్రామంలోని భూముల వివాదంపై దాఖలైన రిట్లపై హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఆ గ్రామంలోని కొంత భాగమే జీవో 111 పరిధిలో ఉంటాయని, మిగిలిన వాటికి జీవో వర్తించదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు చెప్పింది.. వట్టినాగులపల్లి గ్రామంలోని తమ భూముల విషయంపై అగ్ని అగ్రోటెక్ ఇతర కంపెనీలు దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పైవివరణ ఇచ్చింది. జీవో 111 పరిధిలో 84 గ్రామాలున్నాయని, అందులో వట్టినాగులపల్లి ఒకటని, ఈ గ్రామంలోని 173, 178 నుంచి 214 నుంచి 260, 512 సర్వే నెంబర్లు జీవో పరిధిలోకి రాబోవని చెప్పింది. జీవో 111 నిబంధనలను మినహాయింపు ఇస్తూ జీవో 69 జారీ అయ్యిందని చెప్పింది. ఈపీటీఆర్ఐ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపింది. వట్టినాగులపల్లి భూముల గురించి విడిగా ప్రత్యేకంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది.
జస్టిస్ రాజశేఖర్‌రెడ్డికి వీడ్కోలు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డికి గురువారం హైకోర్టు వీడ్కోలు చెప్పింది. చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ అధ్యక్షతన మొదటి కోర్టు హాల్లో ప్రత్యేక వీడ్కోలు సమావేశం జరిగింది. తనకు న్యాయాధికారులు, న్యాయవాదులంతా సహరించినందుకు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి కతజ్ఞతలు తెలిపారు. కష్టించి పనిచేయాలని యంగ్ లాయర్లకు సలహా ఇచ్చారు. మే 3వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆ తేదీన హైకోర్టుకు వేసవి సెలువుల కారణంగా ముందుగానే వీడ్కోలు సమావేశాన్ని హైకోర్టు నిర్హించింది.