Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రకటన మద్దతు సభ వచ్చేనెల ఒకటో తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు జీవోనెంబర్ 16, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగ, లెక్చరర్ల క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సానుకూల ప్రకటన చేశారని తెలిపారు. ఈ ప్రకటనకు మద్దతుగా జీవో నెంబర్ 16 పరిధిలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల మద్దతు సభను వచ్చేనెల ఒకటో తేదీన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జయప్రదం చేయాలని కోరారు.