Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర రవాణా, ప్రొహిబిషన్ ఎక్సైజ్ విభాగాల్లో మొత్తం 677 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రవాణా శాఖలోని హెచ్ఓ విభాగాలలో ఆరు పోస్టులు, ఎల్సీ విభాగాలలో 57 పోస్టులు ఉన్నాయి. అలాగే, రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ విభాగాలలో మొత్తం 614 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్లైన్లో మే 2 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులకు అవసరమైన విద్యార్హతతో పాటు ఇతర దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తమ అధికార వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. టీఎస్ఎల్పీఆర్బీ.ఇన్ లో పొందుపర్చటం జరిగింద ని బోర్డు చైర్మెన్ వీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు.