Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు మధుయాష్కీ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇన్ని రోజులు బీజేపీతో అంటకాగి ఇప్పుడు విమర్శిస్తే ప్రజలు మిమ్ముల్ని నమ్ముతారా? అని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ ప్రశ్నించారు. కూట్లో రాయి తీయలేని వాడు...ఏట్లో రాయి తీస్తానన్నట్టు టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు.ఆయన జీవితమే మోసంతో ప్రారంభమైందని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేత జగదీశ్వర్‌తో కలిసి మధుయాష్కీ విలేకర్లతో మాట్లాడారు. మంత్రులు తలసాని శ్రీనివాసయా దవ్, గంగుల కమలాకర్, దానం నాగేందర్ వంటి ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని కేసీఆర్ ప్లీనరీ నిర్వహించారని ఆరోపించారు. తమది ఉద్యమ పార్టీ అన్న కేసీఆర్ కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణకు ఏం చేశారని కేసీఆర్...దేశ రాజకీయాల్లోకి వెళతారని నిలదీశారు. టీఆర్ఎస్కు కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే టీఆర్ఎస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్కు 30 సీట్ల కంటే ఎక్కువ రావన్న సంకేతాలు వచ్చాయన్నారు. రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామనీ, బలహీనంగా ఉన్న చోట భేటీలు నిర్వహించాలంటూ ఎంపీ కోమటిరెడ్డి సూచిస్తు న్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.