Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలురోడ్లకు రోడ్లకు శంకుస్థాపన
- ఎన్హెచ్ 161 ప్రారంభం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీ శుక్రవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రోడ్లు నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ఎన్హెచ్ 161లో నిర్మించిన రెండు జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్మించిన రామసాన్పల్లె నుంచి మంగళూర్వైపు నాలుగు లైన్ల రహదారి దాదాపు 47 కిలోమీటర్ల మేర రూ. 1614 కోట్లతోపాటు ఇదే ఎన్ హెచ్లో మహరాష్ట్ర వైపు గల 49 కిలోమీటర్లు గల రోడ్డును రూ. 1312 కోట్ల పూర్తి చేసిన జాతీయ రహదారిని సైతం జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఆయన రూ. 5,080.9 కోట్లతో చేపట్టే 11 వేర్వేరు జాతీయ రహదారులు నిర్మాణం, అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి వికె సింగ్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.