Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండిత ఐక్యవేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భాషాపండితులు ఆందోళన చెందొద్దని పండిత ఐక్యవేదిక (ఆర్‌యూపీపీటీ, ఎస్‌ఎల్‌టీఏటీఎస్) విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను ఐక్యవేదిక నాయకులు మహమ్మద్ అబ్దుల్లా, చక్రవర్తుల శ్రీనివాస్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. భాషాపండితుల పదోన్నతుల పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. 2,3 జీవోల ద్వారానే వారికి పదోన్నతులు కల్పించేలా విద్యాశాఖ కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు గొళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, గౌరీశంకర్రావు, విఎస్ఎస్సీఎస్ శర్మ, ఎం ప్రవీణ్‌కుమార్, ఎస్ లక్ష్మినారాయణ, బి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.