Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్దంకి దయాకర్, విఎస్ బోస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూప్పై ఏండ్ల క్రితం సినిమా కార్మికుల గహ వసతి కోసం కేటాయించిన 67 ఎకరాల్లో ఏర్పాటైన 'చిత్రపురి' భూబకాసుల చేతిలో బందీ అయిందని కాంగ్రెస్ నేత అద్దంకిదయాకర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ ఆరోపించారు. చిత్రపురి వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని కోఆపరేటివ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మొత్తం 16 మంది రూ. 111 కోట్ల రూపాయలమేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇండ్లను అక్రమంగా అమ్ముకున్నారని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన కార్మికులకు ఇండ్ల పట్టాలు అందే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి ఎం నర్సింహా, సినీ డైరెక్టర్ మద్దినేని రమేష్, యూనియన్ ప్రతినిధులు కస్తూరి శ్రీనివాస్, చిలుకూరి రవీందర్, మల్లిక, రమాదేవి, మాన్యవాని, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అడిషనల్ రిజిష్ట్రార్ జె శ్రీనివాసరావుకు అందజేశారు.