Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవగాహన ఒప్పందం
హైదరాబాద్ : ఆచార్య ఎన్ జి రంగా విశ్వవిద్యాలయం (ఏఎన్జీఆర్ఏయూ), వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరిగింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం గుంటూరులోని ఏఎన్జీఆర్ఏయూ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం జరిగింది. వ్యవసాయరంగంలో స్మార్ట్ ఫార్మింగ్‌పై పరిశోధనలే ప్రధాన లక్ష్యంగా ఈ అవగాహనా ఒప్పందం జరగ గమనార్హం. ఏఎన్జీఆర్ఏయూ వైస్ ఛాన్సలర్ డా|| ఏ.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫార్మింగ్ లోని పరిశోధన సవాళ్లు, డ్రోన్ల వినియోగం, వ్యవసాయానికి సంబంధించిన వివిధ అప్లికేషన్లలో రోబోల అవసరం ఉందనీ, ఈ తరహ పరిశో ధనలతో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు చేస్తున్న సేవలకు ఏఎన్జీఆర్ఏయూ బృందాన్ని అభినందించారు. వీఐటీ ఏపీ చేసిన పరిశోధనలు, సాధించిన విజయాలను తెలియచేసారు. వ్యవసాయరంగంలో ప్రచురించిన వివిధ పరిశోధనాత్మక పత్రాలు, పేటెంట్ల వివరాలను డా|| సుమతి వివరించారు. వీఐటీ ఏపీ విద్యార్థులు, అధ్యాపక బృందంచే రూపొందించబడిన రెండు ఆటోమేటెడ్ రోబోట్లు టీఏఆర్ఎస్, వీఐఎస్యూలపైనా వివరించారు. వీఐటీ ఏపీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డీన్ డా|| ఎస్.వి. సుధ, డా|| అజిత్ జుబిల్సన్ భవిష్యత్తులో ఈ అవగాహనా ఒప్పందం ద్వారా జరగబోయే పరిశోధనలపై ఈ కార్యక్రమంలో పాల్గొన్న బందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్జీఆర్ఏయూ ప్రొఫెసర్లు డా|| టి. గిరిధర కష్ణ, (రిజిస్ట్రార్), డా||. కె . ఎల్ల రెడ్డి, (డీన్ - అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ), డా||. ఏ. ప్రతాప్ కుమార్ రెడ్డి, (డీన్-అగ్రికల్చర్) డా||ఎం.మార్టిన్ లూథర్, (డీన్ - విద్యార్థి వ్యవహారాలు), డా|| జి. రామారావు, (డీన్ - పీజీ అధ్యయనాలు), డా|| టి.నీరజ (డీన్ - కమ్యూనిటీ సైన్స్) పాల్గొన్నారు.