Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ-చౌటుప్పల్
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, గ్రామగ్రామాన మేడే జెండాను ఎగురవేసి జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మండల జనరల్‌బాడీ సమావేశం రాగీరు కిష్టయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 8 గంటల పని దినం కోసం లక్షలాది మంది కార్మికులు రక్తం చిందించి నెత్తుటి జెండాలు ఎగిసిన రోజు మేడే అన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని గ్రామగ్రామాన పెద్ద ఎత్తున మేడే నిర్వహించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వాటిపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యమాలు చేపట్టాలని సూచిం చారు. జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ మాట్లాడుతూ.. నేటి పాలకులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, మతోన్మాద చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. మేడే వేడుకలు జెండా ఎగురవేయడం వరకే పరిమితం కాకుండా పండుగలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, రొడ్డ అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్డీ పాషా, మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహ, నాయకులు ఆదిమూలం నందీశ్వర్, పొట్ట శ్రీను, పల్లె మధు, శివ, అంతటి అశోక్, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.