Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు రైతులకు విస్తృత సమాచారం అందించేందుకుగానూ 'ప్రత్యేక మొబైల్ యాప్' రూపొందించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో ఐదులక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను చేపట్టాలంటూ సీఎం నిర్ధేశించిన లక్ష్యంపై ఆర్థిక, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యానవనశాఖ అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 4 నుంచి 5 రేట్లు లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ సాగును 20 లక్షల ఎకారాల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో ఆయా తోటలను పెంచేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్‌రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్, ఉద్యానవన శాఖ సంచాలకులు వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.