Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు సోదరులంతా మా కుటుంబసభ్యులతో సమానం : ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
పోలీసు అధికారితో బుధవారం జరిగిన సంఘటనలో నోరుజారి ఆవేశంలో మాట్లాడినట్టు ఆ విషయంలో పొరపాటు జరిగిందని, ఆవేశంలో చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డితో జరిగిన ఫోన్ సంభాషణ ఆన్లైన్లో వైరల్ కావడంతో అది కాస్తా రాజకీయ దూమారం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గురువారం ఎమ్మెల్సీ స్పందించారు. నిన్నటి సంఘటన ఆడియో క్లిప్పులతో పోలీసుల మనస్సు నోప్పించడం పట్ల బాధపడుతున్నట్టు తెలిపారు. పోలీసు సోదరులంతా నా కుటుంబసభ్యులతో సమానమన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతల్లో వారి కృషి అభినందనీయమని చెప్పారు. నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్‌లో ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారడం పట్ల కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పుకొచ్చారు.