Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
థర్మో ఫిషర్ సైంట ిఫిక్ ఇండియా ఇంజి నీరింగ్ సెంటర్ (ఐఈసీ) రీసర్చ్, డెవలప్ మెంట్ విభాగాన్ని రాష్ట్ర పరి శ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభిం చారు. గురువారం హైద రాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగానికి దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే హైదరాబాద్ పేరుగాంచిందని తెలిపారు. థర్మో ఫిషర్ 450 ఉద్యోగాలను కల్పించిందనీ, అనేక నూతన ఆలోచనల ఆవిష్కరణల దిశగా పరిశోధనలు సాగిస్తున్నదని తెలిపారు. థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఆసియా పసిఫిక్, జపాన్ ప్రెసిడెంట్ టోనీ ఆక్సెర్టియో మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్లకు తగిన ఉత్పత్తులను రాబట్టేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంజినీరింగ్, జీవశాస్త్రాలు, ఐటీ రంగాల హబ్‌గా మారిన హైదరాబాద్ పరిశోధనలకు అనువైన ప్రాంతమని భావించినట్టు తెలిపారు..