Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గురువారం రాత్రి భేటీ అయ్యారు. తన తల్లి వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన ఆయన... ప్రగతి భవన్లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురూ జాతీయ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. తాజాగా నిర్వహించిన టీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశం, అందులో ఆమోదించిన తీర్మానాలు, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించాలనే నిర్ణయం, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, వాటిని నీరుగారుస్తున్న మోడీ సర్కారు విధానాలు తదితరాంశాలపై వారిరువురూ సమాలోచనలు చేసినట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. గత నెల్లో కేసీఆర్... ఝార్ఖండ్ వెళ్లి హేమంత్ సోరెన్‌తోపాటు ఆయన తండ్రి, మాజీ సీఎం శిబు సోరెన్‌తో కూడా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్లీనరీ జరిగిన మరుసటి రోజే కేసీఆర్, హేమంత్ భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.