Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రికి డీటీఎఫ్ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జోక్యం చేసుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీిఎఫ్) రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్ రఘుశంకర్రెడ్డి, టీ లింగారెడ్డి శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏడేండ్లుగా బదిలీలు, పదోన్నతులు లేక ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, జిల్లా విద్యాధికారి పోస్టులు 90 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయనీ, పర్యవేక్షణ వ్యవస్థ కుంటుపడిందనీ, విద్యాశాఖమంత్రి అప్పుడప్పుడు సంఘాలతో, ఎమ్మెల్సీలతో సమావేశాలు, చర్చలు జరిపినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. అసంబద్ధ జీవోలు, కోర్టు వివాదాలు, ఏకీకృత సర్వీసురూల్స్ వంటి సమస్యలు విద్యారంగాన్ని తిరోగమనంలోకి నెట్టివేస్తున్నాయని వివరించారు. అందువల్ల సీఎంకేసీఆర్ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.