Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాటా ఎఐజి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా 'టాటా ఎఐజి క్రిటీ-మెడికేర్' బీమా పాలసీని ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇందులో 100 రోగాలకు ఇది బీమా కల్పిస్తుందని తెలిపింది. దీంతో తమ పాలసీదారులు హాస్పిటల్ నగదు లాభాలను కూడా పొందవచ్చని పేర్కొంది. క్లిష్టమైన వ్యాధులు, క్యాన్సర్ 360 డిగ్రీ పరిహారం, హాస్పిటల్ నగదు తదితర ఫీచర్లు ఈ పాలసీ ప్రత్యేకతలని తెలిపింది. 100 రకాల రోగాలు, 50 వ్యాధులుగా ఇందులో రెండు రకాల ప్లాన్లు ఉన్నాయని పేర్కొంది.