Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణం చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బిఇడి మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజులను స్పెషల్ ఫీజు పేరుతో రూ.4 వేలు,పరీక్ష ఫీజు రూ.1,500, ల్యాబ్ ఫీజు రూ.1500 పేరుతో ఒక్కో విద్యార్ధి నుంచి రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారనీ, ఈ దోపిడీని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టీ నాగరాజు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎడ్సెట్ అలాట్మెంట్ కాఫీలో జీ.వో. నెంబర్ 78 ప్రకారం స్పెషల్ ఫీజులు వసూలు చేయవచ్చని ఉందని చెప్పి ఈ తరహా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు జీ.వో.నెంబర్ 78 ప్రకారం ఎలాంటి స్పెషల్ ఫీజులు వసూలు చేయకూడదని చెప్పిందనీ, ఈ తీర్పును ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. దీనిపై ఉన్నత విద్యామండలి, టిఏఫ్ఆర్సీ జోక్యం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.