Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వరంగల్‌లో జరిగే కాంగ్రెస్‌పార్టీ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించాలని పీఏసీ సమావేశం నిర్ణయించింది. మే 6, 7 తేదీల్లో రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటనపై కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో చర్చించారు. ఆ వివరాలను పీఏసీ చైర్మెన్ షబ్బీర్ అలీ మీడియాకు వివరించారు. ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ చేయబోతున్నామని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేదలకు అసైన్డ్ భూములు ఇచ్చిందనీ, వాటిని టీఆర్ఎస్ పార్టీ లాక్కుంటున్నదని అన్నారు. వరంగల్‌లో రాహుల్ సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. పోరాటానికి పుట్టినిల్లు అయిన వరంగల్ నుంచే సమరశంఖం పూరిస్తామన్నారు.