Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన గ్రామాల్లో తాగు నీటి సమస్య ఉండొద్దనీ, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ఉన్నతాధికారులతో కలిసి ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో వెబినార్ నిర్వహించారు. మిషన్భగీరథతో అందరికీ స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నామనీ, ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం వాటిని పరిష్కారం చేయాలన్నారు. కరెంటు లేని చోట సోలార్ ద్వారా విద్యుత్ అందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని కలెక్టర్లు, ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో నీటి ఎద్దడి రాకుండా చూడాలని ఆదేశించారు. తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన చోట వాటర్ ట్యాంకర్లతో నీరు అందించాలని సూచించారు.