Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏఎఫ్ఆర్సీకి టీఎస్టీసిఈఏ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సాంకేతిక కాలేజీల యాజమాన్యాలు ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలపై విచారణ జరపాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) అధ్యక్షులు అయినేని.సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయా కళాశాలల యాజమాన్యాలతో ఫీజుల పెంపుపై టీఏఎఫ్ఆర్సీ సమావేశమవుతున్నదనీ, ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు, తల్లితండ్రుల సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండేండ్లుగా ఉద్యోగులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారనీ, ఇప్పటికీ చాలా కాలేజిలో జీతాలు చెల్లించట్లేదని తెలిపారు. వేతన సంఘం జీతాలు ఎక్కడ కూడా చెల్లించట్లేదని అన్నారు. యాజమాన్యాలు టీఏఎప్ఆర్సీ, ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్కు వేర్వేరు నివేదికలు ఇస్తున్నాయనీ, వీటిపైనా విచారణ జరపాలని కోరారు.