Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న 55 మంది జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా వివిధ జిల్లాల్లో, సెషన్స్ కోర్టుల్లో జడ్జీలుగా పనిచేస్తున్నారు. వీరిలో కొందరికి ఫుల్చార్జీ ఇవ్వగా, మరికొందరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఒకేసారి ఇంతమంది జడ్జీలను బదిలీ చేయడం న్యాయశాఖలో చర్చనీయాంశంమైంది. బదిలీ అయిన జడ్జీలు తక్షణం విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.