Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరమెరిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఈ ఏడాదిలో ఇదే అత్యధికం
- ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
- పలుప్రాంతాలకు వర్షసూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. భగభగ మండిపోతున్నాడు. ఈ ఏడాదిలోనే తొలిసారి అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా కెరమెరిలో రికార్డయింది. 21 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీలు దాటిన ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. మరోవైపు గాలితో తేమ శాతం కూడా తగ్గింది. దీంతో ఉబ్బరం పెరిగింది. వచ్చే మూడ్రోజుల పాటు ఉత్తరతెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయట తిరగడం వీలైనంత మేరకు తగ్గించు కోవాలని సూచిం చారు. అదే సమయంలో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలి ఓపారు. శుక్రవారం ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాలేదు.
కెరమెరి (కొమ్రంభీమ్ అసిఫాబాద్) 45.8
కడెంపెద్దూరు(నిర్మల్) 45.7
కొల్వాయి(జగిత్యాల) 45.5
కుంతాల(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 45.4
జైనధ్(ఆదిలాబాద్) 45.4
మేడిపల్లి(జగిత్యాల) 45.3
చాప్రాల(ఆదిలాబాద్) 45.3
తిరుమలగిరి(సూర్యాపేట) 45.2
నిజామాబాద్ 45.2