Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్పాహారం విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ
- ప్రయివేటు ఆస్పత్రికి తరలింపు
- గౌలిదొడ్డి రెసిడెన్షియల్ కళాశాలలో ఘటన
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్, విద్యార్థి తల్లిదండ్రులు
నవతెలంగాణ-మియాపూర్
అల్పాహారం విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణతో ఓ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి రెసిడెన్షియల్ కళాశాలలో 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్రగాయాలు కావడంతో, తోటి విద్యార్థులు, సిబ్బంది సాయంతో దగ్గరల్లో ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సీఐ సురేశ్, కళాశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న గౌలిదొడ్డి రెసిడెన్షియల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అల్నాహారం విషయంలో గొడవ పడ్డారు. విద్యార్థులకు సర్దిచెప్పి టీచర్ అక్కడి నుంచి పంపించింది. అదే రోజు అర్థరాత్రి సమయంలో ఇద్దరిలో ఒకరు మరో విద్యార్థిపై కత్తితో దాడిచేశాడు. గమనించిన తోటి విద్యార్థులు కళాశాల సిబ్బంది సాయంతో దగ్గరల్లో ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆస్పత్రికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. దాడి చేసిన విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.