Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏడేండ్ల తమ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత, గుర్తింపు ఇచ్చిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు దాసు సురేష్ చెప్పారు. నేతలకు బీమా అమలు చేయడం అభినందనీయమన్నారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో నేతన్నలకు రూ.5లక్షల బీమా అమలు కోసం జీవోను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చేనేత వృత్తి బతకాలంటే 18 ఏండ్ల వయసు నుంచే నెలకు రూ. 3,016 పెన్షన్ అందించాలని కోరారు. ఏడేండ్లలో చనిపోయిన 350 మందికి ఎక్స్‌గ్రేషియాతోపాటు సొంతింటి వసతి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భీమా పొందేందుకు నిర్ణయించిన 59ఏళ్ల ఏజ్ లిమిట్ ను 70 ఏళ్లకు పెంచాలని కోరారు. అంతేకాకుండా, చేనేతకు రాజకీయంగా ఓ మంత్రి పదవి ఇవ్వాలన్నారు. బీసీ పాలసీని ప్రకటిస్తూ, టి ఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ లో ప్రతిపాదించడం ఆహ్వానించ దగ్గ అంశ మన్నారు. బిసి బిల్లుకై నిర్వహించే తమ పోరాటానికి జాతీయంగా సహకారం అందిస్తామని టి ఆర్ ఎస్ పార్టీ హామీ ఇవ్వడం శుభపరిణామన్నారు. రాష్ట్రంలో వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్ లలో పోటీ పడే బీసీ అభ్యర్థులకు క్రిమిలేయర్ సర్టిఫికెట్ ను ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్యార్వ్లు త్వరితగతిన అందజేయాలన్నారు.