Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరే ఉన్నచోట 15 రోజుల సెలవులు నిర్ణయించి
అమలు చేయాలి
- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్,
హెల్పర్స్ యూనియన్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్వాడీ ఉద్యోగుల్లో ఇద్దరికీ ఒకేసారి మే నెలంతా సెలవులు ఇవ్వాలనీ, మినీ వర్కర్లు, ఆయాలు లేని టీచర్లు, టీచర్లు లేని ఆయాలకు సెలవుల పైన స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ అంగన్వఆడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.పద్మ, పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. 'మే 1 నుంచి 15 వరకు టీచర్లకు, మే 16 నుంచి 30 వరకు హెల్పర్లకు సెలవులు ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల మనోభావాలకు భిన్నంగా ప్రభుత్వం ఈ నిర్ణయం చేసిందని అంగన్వాడీ ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. ఇద్దరికీ ఒకేసారి మే నెలంతా సెలవులు ఇవ్వాలని అడిగితే మళ్ళీ పాత పద్ధతిలోనే సెలవులు ఇచ్చినందుకు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాలి. మే నెలంతా ఇద్దరికి ఒకేసారి సెలవులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌లో మినీ వర్కర్లు, ఆయాలు లేని టీచర్లు, టీచర్లు లేని ఆయాలకు సెలవుల పైన స్పష్టత ఇవ్వలేదు. ఆయాలు లేకుండా మినీ వర్కర్ల వ్యవస్థను నిర్మించడం, నేటికీ రాష్ట్రవ్యాప్తంగా అనేక ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తున్నది ప్రభుత్వం. ఈ సమస్యలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించా లి.అంతే తప్ప సెలవుల్లేకుండా పని చేయించుకో వడం సమంజసం కాదు. అందరితో సమానంగా వీరికి కూడా 15 రోజులు సెలవులు ఇచ్చే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కూడిన పరిష్కారాన్ని ప్రభుత్వం చూపించాలి' అని లేఖలో కోరారు.