Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు ఆదేశించిన మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై 21 గుడిసెలు దగ్ధం కావటంతో 40 కుటుంబాలు నిరాశ్రయులుగా మారారనీ, వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించనున్నట్టు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి 40 కుటుంబాలకు రూ.25వేల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ శాఖ నుంచి నష్టపోయిన కుటుంబాలకు రూ. 15వేల నష్టపరిహారం, 25 కిలోల బియ్యం, రూ.1800 విలువైన 12 వస్తువుల వంట సామాగ్రి కిట్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వారు కుదటపడే వరకు ప్రభుత్వమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి అన్ని వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.