Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ గాలివినోద్కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉస్మానియాయూనివర్సిటీ (ఓయూ) మేధోమథన సదస్సుకు రాహుల్ వస్తే తప్పేంటని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఎంపీగా రాహుల్‌గాంధీ పార్టీ జెండా లేకుండా తెలంగాణ ఎజెండాతో సదస్సుకు వస్తే తప్పేంటని ప్రశ్నించారు. శుక్రవారం ఉస్మానియావిశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలోని తన చాంబర్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీ నేతలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సదస్సులకు వస్తున్నారని రాహుల్ వచ్చి తన అభిప్రాయాలను మేధావులు, పరిశోధక విద్యార్థులతో పంచుకుంటే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. భారతదేశాన్ని, నవ తెలంగాణను నిర్మించాలంటే అనేక ఆలోచనల సంఘర్షణ జరగాలనీ, ఆ దిశగా రాహుల్ సందేశం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.