Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలడంపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటన గురించి తెలిసి తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని గవర్నర్ పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా ననీ,గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించా లని ప్రభుత్వ అధికారులకు గవర్నర్ సూచించారు.