Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ (గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం, ఆంగ్లం)లుగా పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులను ఎస్ఏలుగా పదోన్నతి ఇవ్వాలని తెలంగాణ ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీలకు పనికి తగిన వేతనం, హౌదా కల్పించాలని కోరారు. గుర్తింపు లేకపోవడం వల్ల వారంతా తీవ్ర మనోవేదనకు గురువుతున్నారని పేర్కొన్నారు. జీవో నెంబర్ 2,3 లను పరిగణనలోకి తీసుకోకుండా, జీవో నెంబర్ 11,12 ప్రకారం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న అర్హత గల ఎస్జీటీను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసి,ి వేసవి సెలవుల్లో జరిగే బదిలీ ప్రమోషన్ల ప్రక్రియలో అర్హత గల వారికి ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.