Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితురాలు మైనర్
నవతెలంగాణ-మహబూబాబాద్
20 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు ఇవ్వలేదనే కోపంతో తండ్రిని హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేములూరుకు చెందిన మండల వెంకన్న (46) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుం టున్నాడు. అతడి భార్య గతేడాది మృతి చెందింది. కూతురును అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో వివాహం చేసేందుకు నిర్ణయించుకుని నిశ్చితార్థం చేశాడు. కాగా వ్యవసాయ భూమికి సంబంధించి పత్రాలు ఇవ్వాలని తండ్రి వెంకన్నతో కూతరు కొద్ది రోజులుగా ఘర్షణ పడుతోంది. ఈ క్రమంలోనే గొడవ జరగ్గా కోపోద్రేకంతో కూతురు కర్రతో తండ్రిని కొట్టింది. దాంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.