Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్ వద్ద రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన వైనం
నవతెలంగాణ - కల్వకుర్తి
విద్యుత్ శాఖ ఏఈ ఓ కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ క్రిష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ పంచాయతి పరిధిలో యాదాద్రి టౌన్షిప్ పేరుతో వెంచర్ నిర్మించారు. అందులో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కోసం కాంట్రాక్టర్ విద్యుత్ శాఖ ఏఈ సురేష్‌ను సంప్రదించారు. అందుకు ఏఈ తనకు రూ.3 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో కాంట్రాక్టర్ ప్రభాకర్ ఏసీబీ డీఎస్పీ క్రిష్ణగౌడ్ను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ లక్ష రూపాయల లంచాన్ని ఏఈకి ఇస్తుండగా కాపు గాసి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఏఈగా బాధ్యతలు చేపట్టిన సురేష్ సిబ్బందితో ఐక్యతగా ఉండకుండా ధనార్జనే ధ్యేయంగా పని చేసేవారనే ఆరోపణలున్నాయి. సెటిల్మెంట్లు చేసేవారని విచారణలో ఏసీబీ తేలింది. ఏఈని అధికారులు విచారిస్తున్నారు. ఈ దాడుల్లో సీఐ నర్సింహ, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.