Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌంమంత్రికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కిచ్చెనపల్లి (భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా) కుట్ర కేసులో అరెస్టులను ఆపేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర హౌం మంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించింది. 2015 నాటి ఈ కుట్ర కేసును ఎత్తివేయాలని ఆ లేఖలో సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరావు, రాష్ట్ర నాయకులు కే.గోవర్ధన్, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య, ఇఫ్ట్ రాష్ట్ర కార్యదర్శి జీ .అనురాధ కోరారు. 2015లో పారెస్ట్ ఉద్యోగి, పోడు సాగుదారులకు మధ్య ఘర్షణ జరిగిందనీ, దానిపై దాదాపు వందమందిపై కేసులు పెట్టారని పేర్కొ న్నారు. ఇదే కేసుకు సంబంధించి తాజాగా మరికొందరు ముఖ్య నాయకులు దశలవారీగా అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో అభద్రత ఏర్పడుతున్నదనీ, ఈ కేసుల్ని ఎత్తేయాలని కోరారు.