Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి, సినీనటి రోజా శుక్రవారం ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబసమేతంగా ఆమె ప్రగతిభవన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్‌కు చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ మంత్రి రోజాకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం సతీమణి శోభ ఏపీ మంత్రిరోజాకు సంప్రదాయపద్ధతిలో బొట్టుపెట్టి సత్కరించారు. రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కూడా అక్కడే రోజాతో మాట్లాడారు.