Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రయివేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం వేసినా దానిపై చర్చించడం లేదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఉపసంఘం కేవలం 'మనఊరు-మనబడి' కార్యక్రమం అమలు వరకే పరిమితం కావడం శోచనీయమని విమర్శించారు. ఫీజుల నియంత్రణను పట్టించుకోకపోవడాన్ని చూస్తే సామాన్యుల పిల్లల భవిష్యత్ పట్ల ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని ఆయన డిమాండ్ చేశారు.