Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోలుకుంటున్నారు. గతనెల 19వ తేదీన ఆయనకు హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిందని ఆఫీసు కార్యదర్శి ఎ గోవిందరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అది జరిగిన మూడురోజుల తర్వాత ఇంట్లో వాంతులు, బేదులు, ఎక్కిళ్లు రావడంతో తిరిగి ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు. ఆ తర్వాత సోడియం స్థాయి పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని వివరించారు. ఆ ఆస్పత్రి నుంచి రెండురోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఆయన నీరసంగా ఉండడంతో కనీసం మరో వారం రోజులపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు.