Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమూరు అధ్యయన వేదిక రౌడ్టేబుల్లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయమే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘం జంటనగరాల కన్వీనర్ రాజేంద్రప్రసాద్ అర్విణి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొని మాట్లాడారు. కృష్ణా నదీ జలాల యాజమాన్యం బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్దమని అన్నారు. నీటిపై హక్కు రాష్ట్రాలకే ఉంటుందనీ, కేంద్రం వివాదాల పరిష్కారానికి మాత్రమే మధ్యవర్తిగా ఉండాలని చెప్పారు. ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మలారెడ్డి మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికలోని అసంబద్ద విషయాలను సభికులకు వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ పాలమూరు జిల్లాకు నీటి కేటాయింపులో చేసిన అన్యాయాన్ని ప్రశ్నించారు. సమావేశంలో వేదిక కన్వీనర్ ఎమ్ రాఘవాచారి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి వేములపల్లి వెంకట్రామయ్య, తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్ది తదితరులు పాల్గొన్నారు. కృష్ణానదీ జలాల పున్ణపంపిణీ కోసం ట్రిబ్యునల్ వెయ్యాలనీ, కేంద్రం జారీ చేసిన గెజిట్ను తక్షణం ఉపసంహరించుకోవాలని సభలో తీర్మానం చేసి, ఆమోదించారు.