Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అమెరికాలోని వాషింగ్ టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహా సభలు - యూత్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం ప్రతినిధులు జయంత్ చల్లా, శరత్ వేముల, రఘువీర్‌రెడ్డి, భువనేశ్ బుజాల, సన్నీరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రావల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990లో ఏర్పడిన ఆటా సంఘం అమెరికాలో తెలుగు కళలు, సంప్రదాయాలు, సంస్కతీ పరిరక్షణకు పాటుడపడుతున్నదని చెప్పారు. రెండేండ్లకోసారి జరిగే మహా సభల్లో వివిధ రంగాలకు చెందిన తెలుగు వారిని పిలిచి వివిధ అంశాలపై చర్చిస్తామని వివరించారు.