Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త,అత్తమామలను కఠినంగా క్షించాలి : ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరకట్న వేధింపులతోనే నిఖిత మృతి చెందిందనీ, అందుకు బాధ్యులైన ఆమె భర్త ఉదరు, అత్త మామలు శ్యామల, అశోక్రావును కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కూకట్పల్లిలోని బాలకృష్ణ నగర్లో అపార్ట్మెంట్లో నివసిస్తున్న జూపల్లి శ్రీనివాసరావు పెద్ద కుమార్తె నిఖితను సిరిసిల్లకు చెందిన ఐటీ ఉద్యోగి ఉదరుకిచ్చి 2021 జూన్లో వివాహం చేశారని తెలిపారు. అదనపు కట్నంతోపాటు భూమి ఇవ్వాలంటూ వారు వేధించారని పేర్కొన్నారు. వేధింపులు తట్టుకోలేకనే ఆమె మృతి చెందినట్టు తెలిసిందని తెలిపారు. ధన దాహంతో, ఆధిపత్య భావజాలంతో వేధింపులకు పాల్పడిన వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.