Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర పేరుతో సమస్యలను గాలికొదిలిన బండిసంజయ్
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించిన పలు పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాదయాత్ర పేరుతో జిల్లాలోని జాతీయ రహదారుల సమస్యలను ఎంపీ బండి సంజరు గాలికొదిలేశారని పేర్కొన్నారు. ఆ యాత్రను ఒకరోజు ఆపి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారుల గురించి బండి సంజరు గుర్తు చేస్తే బాగుండేదని సూచించారు. ఢిల్లీకి వెళ్లి జిల్లాలో మూడు జాతీయ రహదారుల పనుల ప్రారంభానికి కృషి చేయాలనీ, నిధులు సాధించుకుని రావాలని డిమాండ్ చేశారు. జిల్లాలో జాతీయ రహదారుల పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు. జాతీయ రహదారుల పనుల్లో మెదక్, సిద్ధిపేట, ఎల్కతుర్తి పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మిగిలిన మూదు జాతీయ రహదారుల పనుల విషయం విస్మరించారని తెలిపారు.'కరీంనగర్-సిరిసిల ్ల-కామారెడ్డి- పిట్లం, కరీంనగర్- వీణవంక- జమ్మికుంట- టేకుమట్ల- భూపాలపల్లి,సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ- కథలాపూర్- కోరుట్ల' జాతీయ రహదారుల పనులను తక్షణమే చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల హబ్‌గా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కార్యాలయాన్ని తాను ప్రారంభించానని గుర్తు చేశారు. పనుల్లేక జాతీయ రహదారుల ఎస్ఈ కార్యాలయం మూతపడిందని ఆందోళన వ్యక్తం చేశారు.