Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ ప్రగతిశీల భావకుడు అని పలువురు వక్తలు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచారనీ, ఆయన సేవల్ని గుర్తించి ప్రభుత్వం బీసీ కమిషన్ సభ్యులుగా కూడా నియమించి గౌరవించిందన్నారు. జూలూరీ గౌరీశంకర్‌తో 40 ఏండ్ల సహచర్యం ఉన్న మిత్రులు శనివారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. ప్రగతిశీల భావాలే ఆయన్ని రచయితగా, జర్నలిస్టుగా తీర్చిదిద్దాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బెండ్ల విజయకుమార్, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షులు కే సుధీర్‌రెడ్డి, రిటైర్ ఇంజినీర్ల సంఘం నాయకులు వెంకటేశం, ఉన్నత విద్యామండలి సభ్యులు ఓ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.